ఆస్ట్రేలియాలో ఏటీఏఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-03T09:33:50+05:30 IST

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ఇన్‌కార్పొరేషన్‌(ఏటీఏఐ) ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆస్ట్రేలియాలో ఏటీఏఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ఇన్‌కార్పొరేషన్‌(ఏటీఏఐ) ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏటీఏఐ సభ్యులు, వివిధ సిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవంలో పాల్గొన్నారు. అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు సకినాలు, సర్వపిండి, పచ్చిపులుసు లాంటి తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మలు పేర్చినవారికి బహుమతులు ప్రకటించారు. విజేతలుగా నిలిచిన ముగ్గురికి బంగారు నాణేలను, బతుకమ్మ పేర్చిన ప్రతీ ఒక్కరికి వెండి నాణేలను ఇచ్చారు. 

Read more