MLAs purchase case: నందకుమార్‌ను కస్టడీ కోరిన పోలీసులు

ABN , First Publish Date - 2022-11-18T11:12:28+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLAs purchase case)లో అరెస్టైన నందకుమార్‌(Nandakumar)ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని

MLAs purchase case: నందకుమార్‌ను కస్టడీ కోరిన పోలీసులు
కస్టడీ!

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLAs purchase case)లో అరెస్టైన నందకుమార్‌(Nandakumar)ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారించిన కోర్టు.. నందకుమార్‌పై నమోదైన కేసుల వివరాలు తెలపాలంటూ పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం కేసుల వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో తదుపరి కేసు విచారణ వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

మునుగోడు ఉపఎన్నికల సమయంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి బేరసారాలు చేశారు. పోలీసులు రైడ్ చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. బేరసారాలకు సంబంధించిన దృశ్యాలు.. ఆడియోలు.. వీడియోలను ప్రభుత్వం బయటపెట్టింది.

Updated Date - 2022-11-18T11:17:29+05:30 IST