Bandi Sanjay Challenged Cm Kcr: దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-09-14T01:51:30+05:30 IST

వీఆర్ఏ(VRA)లు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ...

Bandi Sanjay Challenged Cm Kcr:  దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి

హైదరాబాద్: వీఆర్ఏ(VRA)లు గొంతెమ్మ కోరికలు కోరడంలేదని.. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) కూకట్‌పల్లిలో సాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వీఆర్ఏలకు సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రగతిభవన్కు వెళ్లిన వీఆర్ఏలపై పోలీసులు దాడి చేశారని మండిపడ్డారు. సభలో ప్రజా సమస్యలపై కాకుండా మోదీని విమర్శించేందుకు సమయం వృథా చేస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 


అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ (Cm Kcr) అబద్ధాలు చెప్తున్నాడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్ల దగ్గర మీటర్లు పెడతారని చేస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మటం లేదన్నారు. బిల్లులో మోటార్ వద్ద మీటర్ అనే పదమే లేదని చెప్పారు. పార్లమెంట్‌లో ఉన్న బిల్లును అసెంబ్లీలో తప్పుదోవ పట్టించుకుంటూ మాట్లాడటం దుర్మార్గమన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 30 గ్రామాలకు వాడుకునే విద్యుత్‌ను ఉచితంగా వాడుకుంటున్నారని తెలిపారు. పాత బస్తీలో విద్యుత్ బకాయిలను ఎందుకు వసూలు చేయటం లేదని చెప్పారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. Read more