యువతిపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2022-10-09T05:16:48+05:30 IST

యువతిపై అత్యాచారయత్నం

యువతిపై అత్యాచారయత్నం

వాజేడు, అక్టోబరు 8: గిరిజన యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ సంఘటన శనివారం వెలుగు చూసింది. పేరూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన గిరిజన యువతి (23) శుక్రవారం తన బంఽధువుల ఇంటికి కృష్ణాపురం వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉంది. ఈ క్రమంలో శ్రీరాంనగర్‌కు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన యువకుడు కృష్ణతేజ బైక్‌పై అక్కడికి వచ్చాడు. ‘మీ బంఽధువులు నాకు తెలుసు.. నేను అటే వెళ్తున్నా..’ అంటూ బైక్‌పై ఆమెను ఎక్కించాడు. ఎర్రబోరు సమీపంలోకి రాగానే జాతీయ రహదారి నుంచి దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. తప్పించుకున్న ఆ యువతి బంధువుల సాయంతో అదే రోజు పేరూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణతేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


Read more