Mahbubabad జిల్లా: మంచ్యాతండాలో దారుణం..

ABN , First Publish Date - 2022-07-18T21:19:29+05:30 IST

మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా: మంచ్యాతండాలో దారుణం జరిగింది.

Mahbubabad జిల్లా: మంచ్యాతండాలో దారుణం..

మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా: మంచ్యాతండాలో దారుణం జరిగింది. తమ్ముడిపై అన్న, అతని కుమారులు దాడి చేశారు. అవమానభారం భరించలేక తమ్ముడు వెంకన్న ఆత్మహత్యాయత్నం (Suicide) చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకన్న (Venkanna) మృతి చెందాడు. ఈ ఘటనతో తండాలో కలకలం రేగింది. వెంకన్న సోదరుడు బాలు (Balu) ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉండడంతో తండాలో ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకన్న మృతికి కారణమైన బాలు కుటుంబాన్ని శిక్షించాలని వారు కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు మంచ్యాతండాకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తండాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more