మర్రిమొదలులో పోడు ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-17T08:27:42+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం మరోసారి పోడు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.

మర్రిమొదలులో పోడు ఉద్రిక్తత

అటవీశాఖ అధికారులను అడ్డుకున్న పోడురైతులు

కరకగూడెం, ఆగస్టు 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం మరోసారి పోడు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కరకగూడెం మండలం మర్రిమొదలులో పోడు భూముల్లో సాగు చేసిన పంటలను ధ్వంసం చేయడానికి వెళ్లిన అధికారులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. వారిని రేంజ్‌ కార్యాలయానికి తరలించిన అధికారులు, మంగళవారం మరోసారి వస్తుండగా రైతులు మళ్లీ అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. మరో ఆరుగురు పోడు రైతులను రేగళ్ల రేంజి కార్యాలయానికి తరలించారు. తాము ఎంతో కాలంగా పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్నామని, ఇటీవల సాగుచేసిన మొక్కజొన్న, పత్తి పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని పోడురైతు కృష్ణకుమారి తెలిపారు.

Read more