యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోమని.. నగదు తస్కరణ

ABN , First Publish Date - 2022-03-18T09:23:41+05:30 IST

కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి ఓ వ్యక్తిని నమ్మించి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయించి అతడి బ్యాంకు ఖాతాలోని నగదును సైబర్‌ నేరగాళ్లు తస్కరించారు.

యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోమని.. నగదు తస్కరణ

నేరేడ్‌మెట్‌: కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి ఓ వ్యక్తిని నమ్మించి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయించి అతడి బ్యాంకు ఖాతాలోని నగదును సైబర్‌ నేరగాళ్లు తస్కరించారు. నేరేడ్‌మెట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుస్టేషన్‌ పరిధిలోని వ్యక్తికి ఈ నెల 3న గుర్తు తెలియని ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. కస్టమర్‌ కేర్‌ నుంచి చేస్తున్నట్లు చెప్పి ఫోన్‌ క్విక్‌ సపోర్ట్‌ కోసం స్లైస్‌, నవీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సలహా ఇచ్చి అతడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించాడు. అంతే అతడి బ్యాంకు ఖాతాలోని రూ. 2,09,654 డెబి ట్‌ అయ్యాయి. షాక్‌ తిన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కే సు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహస్వామి తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వా రా జరిగే మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more