‘సీట్ల బ్లాక్‌’పై సీబీఐ విచారణ కోరండి

ABN , First Publish Date - 2022-04-24T08:55:00+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్ల దందాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.

‘సీట్ల బ్లాక్‌’పై సీబీఐ  విచారణ కోరండి

  • చాన్స్‌లర్‌గా మీ అధికారాలను వినియోగించండి
  • ‘ప్రైవేటు’ పీజీ సీట్ల దందాపై గవర్నర్‌కు రేవంత్‌ లేఖ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్ల దందాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. మంత్రుల ప్రమేయం ఉన్నందున పోలీసులకు ఫిర్యాదులు, ఆషామాషీ విచారణతో విషయం నిగ్గు తేలదన్నారు. కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీని నివేదిక కోరినంత మాత్రాన సరిపోదని, వర్సిటీలకు చాన్స్‌లర్‌ హోదాలో ఉన్న తమిళిసై.. తన విస్తృత అధికారాలను వినియోగించాలని కోరారు.    వారం రోజులుగా పేద, మధ్య తరగతి విద్యార్థులు   ఆందోళనలు చేస్తున్నా సీఎంగానీ, వైద్య, ఆరోగ్య మంత్రిగానీ స్పందించలేదని చెప్పారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్‌ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఏటా రూ.100 కోట్ల మేర బ్లాక్‌ సీట్ల దందా నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. 

Updated Date - 2022-04-24T08:55:00+05:30 IST