రోబోలతో యాంజియోప్లాస్టీ

ABN , First Publish Date - 2022-09-24T09:24:55+05:30 IST

అత్యాధునిక రోబో అసిస్టెడ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ విధానాలను దేశంలో తొలిసారి తెలంగాణ, ఏపీల్లో అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ...

రోబోలతో యాంజియోప్లాస్టీ

  • జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో అందుబాటు
  • ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీలో కీలక మార్పు
  • అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ జేఎండీ సంగీతారెడ్డి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): అత్యాధునిక రోబో అసిస్టెడ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ విధానాలను దేశంలో తొలిసారి తెలంగాణ, ఏపీల్లో అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి చెందిన హృద్రోగ నిపుణులు వెల్లడించారు. గుండె శస్త్రచికిత్సలను రోబో సాయంతో నిర్వహించేలా.. ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్‌ సిటీలో అత్యాదునిక కార్డియ క్‌ కేర్‌ సర్వీసు, రోబో అసిస్టెడ్‌ యాంజియోప్లాస్టీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ విధానంలో కచ్చితమైన సంరక్షణతో పాటు రోగి వేగంగా కోలుకోవడంపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు వీలుంటుందని.. వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 


శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మరోవైపు రోబో సాయం తో శస్త్రచికిత్సలు చేపడుతున్నందున.. మానవ తప్పిదాలకు అవకాశం ఉండదని వివరించారు. రోగులు, వైద్యులకు రేడియేషన్‌ ముప్పును తగ్గిస్తుందన్నారు. గుండె ధమనుల్లోని అడ్డంకుల (బ్లాక్‌లు)ను తొలగించే కరోనరీ యాంజియోప్లాస్టీలో రోబో ల ప్రవేశాన్ని రోగి కేంద్రీకృత వైద్య ఆవిష్కరణల్లో మరో ముందడుగుగా అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి అభివర్ణించారు.  ఇప్పటివరకు 15 రోబోటిక్‌ యాంజియోప్లాస్టీలను నిర్వహించామని, వాటిలో ప్రధాన స్టెంటింగ్‌, వేనస్‌ గ్రాఫ్‌ యాంజియోప్లాస్టీ, డబుల్‌ యాంజియోప్లాస్టీలను నిర్వహించినట్లు అపోలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ పీసీ రథ్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రస్తుతం బెలూన్‌ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్‌ను మాన్యువల్‌గా చేస్తున్నారని.. స్టెంట్‌ అమరికలో మిల్లీమీటరు తేడా వచ్చినా రోగికి ఇబ్బంది అని పేర్కొన్నారు. 

Read more