తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు... విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2022-09-19T23:12:45+05:30 IST

తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు... విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు... విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి, ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి పెంచాలని పిటిషన్‌ దాఖలైంది. విభజన చట్టం రూల్స్‌ అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌ వేశారు. పర్యావరణ నిపుణులు ప్రొ. పురుషోత్తంరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Read more