‘ఆంధ్రజ్యోతి’ విలేకరికి.. కళారత్న జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2022-09-19T09:16:36+05:30 IST

నల్లగొండ జిల్లా చండూరు ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్‌ బరిగెల శ్రీనివా్‌సకు బహుజన సాహిత్య అకాడమీ సంస్థ అందజేసే కళారత్న జాతీయ అవార్డు దక్కింది.

‘ఆంధ్రజ్యోతి’ విలేకరికి.. కళారత్న జాతీయ అవార్డు

పురస్కారానికి ఎంపికైన చండూరు రిపోర్టర్‌

చండూరు, సెప్టెంబరు 18: నల్లగొండ జిల్లా చండూరు ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్‌ బరిగెల శ్రీనివా్‌సకు బహుజన సాహిత్య అకాడమీ సంస్థ అందజేసే కళారత్న జాతీయ అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంస్థ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నేషనల్‌ కోఆర్డినేటర్‌ నల్లా రాధాకృష్ణ.. శ్రీనివా్‌సకు సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడారు. చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ చిన్ననాటి నుంచే సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలను గీస్తున్నారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలపై ఆయన గీసిన చిత్రం కంట నీరుపెట్టించేలా ఉందన్నారు. ‘ఆడుకునే వాటిని అమ్ముకుంటున్న ఆకలి’ అంటూ గీసిన మరో చిత్రం ఆలోచింపజేస్తోందన్నారు. ఈ రెండు చిత్రాలు అవార్డుకు ఎంపికైనట్లు వెల్లడించారు. నవంబరు 13న ఢిల్లీలో నిర్వహించే నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో బహుమతి అందజేస్తామని తెలిపారు. 

Read more