‘ఎల్‌బ్రస్‌’ అధిరోహించిన 18 ఏళ్ల యువకుడు

ABN , First Publish Date - 2022-09-17T10:38:02+05:30 IST

ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్‌(5,642 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించి ఔరా..

‘ఎల్‌బ్రస్‌’ అధిరోహించిన 18 ఏళ్ల యువకుడు

గతంలో కిలిమంజారోను కూడా 

అధిరోహించిన భూక్యా యశ్వంత్‌ నాయక్‌

రాంనగర్‌, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్‌(5,642 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించి ఔరా.. అనిపించాడు హైదరాబాద్‌కు చెందిన భూక్యా యశ్వంత్‌నాయక్‌. యశ్వంత్‌ వయస్సు 18 ఏళ్లు. ఇంటర్‌ పూర్తి చేశాడు.  ఎలబ్రస్‌ పర్వతాన్ని అధిరోహించడానికి ఈ నెల 8న హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లాడు. 10న రష్యా చేరుకున్నాడు. 11వ తేదీన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించి 16వ తేదీన ఉదయం 8.15 నిముషాలకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. మైనస్‌ 22 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకొని నాలుగు రోజులు కష్టపడి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. యశ్వంత్‌ గతంలో ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. యశ్వంత్‌ ఆసక్తి, ధైర్య సాహసాలను గుర్తించిన అంబరిల్లా ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీనివాస్‌  యశ్వంత్‌కు ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించారు.

Read more