అంబేద్కర్‌ కలలు నిజమవుతున్నాయి...

ABN , First Publish Date - 2022-09-17T06:09:03+05:30 IST

అంబేద్కర్‌ కలలు నిజమవుతున్నాయి...

అంబేద్కర్‌ కలలు నిజమవుతున్నాయి...
ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సభలో మాట్లాడుతున్న వినయభాస్కర్‌

ఎక్కడా అమలుకాని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి

కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు..

రాష్ట్రం కోసం శ్రమిస్తున్న సీఎంకు అండగా నిలుద్దాం..

ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌

ఘనంగా మొదలైన ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు’

హనుమకొండలో భారీ ర్యాలీ.. ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో సభ


హనుమకొండ టౌన్‌, సెప్టెంబరు 16: రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో జాతీయ పార్టీ ఆవిర్భవించనుందని, కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ తెలిపారు. ‘తెలంగాణ జా తీయ సమైక్యత వజ్రోత్సవాల’ను జిల్లా కలెక్టర్‌ రా జీవ్‌గాంధీ హనుమంతు అధ్యక్షతన శు క్రవారం ఘనంగా నిర్వహించారు. హ నుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌ నుంచి ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వివిధ రంగాలకు చెందిన వారు జాతీయ జెండా చేతబూ ని ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ఆద్యంతం దేశ భక్తి గీతాలు నినాదాలతో మారుమోగింది. అనంతంరం ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో సభను నిర్వహించారు. 


ఈ సభలో పాల్గొన్న వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. నాటి త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గాంధేయ మార్గం లో, అహింసా పద్ధతిలో పోరాడిన కేసీఆర్‌.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేశారని కొనియాడారు. అంబేద్కర్‌ కన్న కలలు నిజం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. రాజ్యాంగం లో పొందుపరిచిన విధంగా విద్య, వైద్యం అందించడంతో పాటు దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వినయభాస్కర్‌ స్పష్టం చేశారు. 


దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని, కే సీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. త్వరలోనే కేసీఆర్‌ నాయకత్వంలో జాతీయ పార్టీ ఆవిర్బవించనుందన్నారు. ప్రపంచంలోనే ఇండియా ను అగ్రస్థానంలో ఉంచే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెడుతానని కేసీఆర్‌ ప్రకటించడంతో పాటు పార్లమెంటుకు కూడా అంబేద్కర్‌ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం గ ర్వకారణమన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానానికి బీజేపీ దూరం ఉందని ఆరోపించారు. కులాలు, మ తాల మధ్య గొడవలు సృష్టించే బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలుద్దామని వినయభాస్కర్‌ కోరారు. 


కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చిన రోజు సెప్టెంబర్‌ 17 అన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి స్వాతం త్య్రం తీసుకువచ్చిన త్యాగధనులను మరువద్దన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. 8యేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 


పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి మాట్లాడుతూ..   తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలీస్‌ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయన్నారు. శాఖకు సౌకర్యాల కల్పన జరిగిందన్నారు. ప్రెండ్లీ పోలీస్‌ బలోపేతమైందన్నారు. తెలంగాణ పోలీసుకు దేశంలో మంచి పేరుందన్నారు. 


ఈ సమావేశంలో మేయర్‌ గుండు సుధారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, డీఆర్‌వో వాసుచంద్ర, మాజీ ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 




హోరెత్తిన పరకాల

పట్టణంలో భారీ ఎత్తున వజ్రోత్సవ ర్యాలీ.. హాజరైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ కడియం


పరకాల, సెప్టెంబరు 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పరకాల నియోజకవర్గ కేంద్రంలో  శుక్రవారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. మొదట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ వద్ద ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జెండా ఊపి 15 వేల మందితో ర్యాలీ ప్రారంభించారు. మధ్యలో అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. 


అనంతరం కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథతో ప్రతీ గ్రామానికి తాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 


ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాలకు ఒక చరిత్ర ఉందని, పోరాడడంలో ముందుండి ప్రాణాలను అర్పించిన పోరుగడ్డ పరకాల అన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రాణాలను అర్పించిన యోధుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాలను తీసుకుంటూ అనేక సంక్షేమ పఽథకాలను నిరుపేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు చెందుతుందని అన్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్‌ను దీవించాల్సిందిపోయి దిగిపోమంటున్నారని అన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే తాను ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి, డీఆర్డీవో శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్‌ పర్స్‌న్‌ సోదా అనిత, కమిషనర్‌ శేషు, జిల్లా పరిషత్‌ సీఈవో వెంకటేశ్వరరావు, పంచాయతీ అధికారి జగదీశ్వర్‌, ఏసీపీ శివరామయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు మార్కెట్‌ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-17T06:09:03+05:30 IST