బీజేపీ అసమ్మతి నేతల అలెర్ట్

ABN , First Publish Date - 2022-02-24T00:58:22+05:30 IST

వేటు తప్పదన్న కారణంతో బీజేపీ అసమ్మతి నేతలు

బీజేపీ అసమ్మతి నేతల అలెర్ట్

హైదరాబాద్: వేటు తప్పదన్న కారణంతో బీజేపీ అసమ్మతి నేతలు అలెర్ట్‌ అయ్యారు. బండి సంజయ్, తరణ్ చుగ్‌కి బీజేపీ నేతలు వివరణ ఇస్తున్నారు. సమావేశ ఎజెండా చెప్పకుండా తమను కొందరు ఆహ్వానించారని వివరించారు. నిన్న హైదరాబాద్‌లో భేటీకి హాజరు కాలేదంటూ చింతా సాంబమూర్తి, కంకణాల శ్రీధర్‌రెడ్డి, పాపారావు, నాగూరావు నామోజీతో పాటు కొందరు వివరణ ఇచ్చారు.  రేపటిలోగా వివరణ ఇవ్వని వారికి షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అసమ్మతి భేటీకి కారకులైన గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగణాకరరావులపై వేటు తప్పదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Read more