మద్యం ఆదాయం మూడింతలు

ABN , First Publish Date - 2022-03-16T08:54:56+05:30 IST

గృహనిర్మాణం, ప్రాజెక్టుల నుంచి విపత్తు నిధులు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు, పోలీసు బడ్జెట్‌ దాకా..

మద్యం ఆదాయం మూడింతలు

  • కార్పొరేషన్ల అప్పుల చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం.. 
  • గృహనిర్మాణం.. అప్పులు ఎక్కువ.. ఇళ్లు తక్కువ
  • విపత్తు నిధి ఉన్నా.. దాని వినియోగం సున్నా
  • లక్ష కోట్లకు పెరిగిన ప్రాజెక్టుల అంచనా వ్యయం
  • ఎస్సీ, ఎస్టీ ఎస్డీసీ నిధుల వ్యయం అంతంతే: కాగ్‌


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గృహనిర్మాణం, ప్రాజెక్టుల నుంచి విపత్తు నిధులు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు, పోలీసు బడ్జెట్‌ దాకా.. కాగ్‌ తన నివేదికలో పలు అంశాలపై పెదవి విరిచింది. మద్యం అమ్మకాల ఆదా యం మాత్రం దండిగా పెరిగిందని.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయం స్థిరంగా పెరుగుతోందని పేర్కొంది. 2015-16లో ఆ ఆదాయం రూ.3,809 కోట్లుండగా.. 2019-20 నాటికి అది రూ.11,992 కోట్లకు పెరిగింది. అంటే.. నాలుగేళ్లలో మద్యం రాబడి దాదాపు మూడింతలు పెరిగినట్టు. ఇంకా కాగ్‌ తన నివేదికలో ఏయే వివరాలు తెలిపిందంటే..


కార్పొరేషన్లు గాలికి..

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేయటానికి వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకోవటం ఒకెత్తయి తే... తిరిగి ఆ అప్పులు చెల్లించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోం ది. బడ్జెట్‌లో ఎలాంటి నిధులూ కేటాయించకుండా కార్పొరేషన్లను గాలికి వదిలేస్తోంది.  


ఖాకీ.. బడ్జెట్‌కు మించి..

 పోలీస్‌ శాఖ బడ్జెట్‌ నియంత్రణ ప్రభావవంతంగా ఉం డటం లేదు. ఐదేళ్లుగా బడ్జెట్‌ కేటాయింపుల కన్నా ఖర్చు ఎ క్కువగా అవుతోంది. ఉదాహరణకు.. 2019-20 బడ్జెట్‌లో 5,253 కోట్లు ప్రతిపాదించగా రూ.5,886 కోట్లు ఖర్చు చేశారు. 2016-17లో రూ.1,040 కోట్లను అదనంగా ఖర్చు చేశారు.


ఇళ్లు లేకున్నా.. అప్పులు మిన్న..

రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌రూం స్కీముకు 2019-20కి ప్రభుత్వం భారీ స్థాయిలో నిధుల కోత విధించింది. 


విపత్తు నిధులతో ఆదుకోలేదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న విపత్తు నిధిలో 2020 మార్చి నెలాఖరు నాటికి రూ. 977.67 కోట్లున్నాయి. కానీ.. 2020- 21, 2021- 22 సంవత్సరాల్లో రాష్ట్రంలో బీభత్సమైన వరదలు వచ్చి పంటలు దెబ్బతిన్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు.


‘ఉదయ్‌’ ఒప్పందం అమలేదీ?

డిస్కమ్‌ల ఆర్థిక సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఉదయ్‌ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలే దు. వ్యవసాయ, ఇతర వర్గాలకు సబ్సిడీ కింద చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ)కి హా మీ ఇచ్చినా 2016-17 నుంచి 2019-20 దాకా ఆ హమీ ప్రకా రం రావాల్సిన రూ.6012 కోట్లు డిస్కమ్‌లకు రాకపోవడంతో వాటి ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింది.


ప్రాజెక్టుల అంచనా వ్యయం పైపైకి

రాష్ట్రంలో 24 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం 2020 మార్చి దాకా కొనసాగుతూనే ఉండటంతో నిర్మాణ అంచనా వ్యయం రూ.1,16,823 కోట్ల నుంచి రూ.2,21,107 కోట్లకు చేరింది. అంటే లక్ష కోట్లకు పైగానే పెరిగినట్టు.


ఎస్సీ, ఎస్టీ నిధుల్లో అవకతవకలు..

ఎస్సీ, ఎస్టీ ఆవాసప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు  బడ్జెట్‌లో కేటాయించే ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) కేటాయింపులు, ఖర్చుల్లో వ్యత్యాసం ఉంది. 2019-20లో ఎస్సీ ఎస్‌డీఎఫ్‌కు రూ.12,400.22 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎ్‌ఫకు రూ. 7,184.87 కోట్లు కేటాయించింది. కానీ..ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ నిధు ల్లో 21్ర, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌26% వినియోగం కాలేదు.


అది రాష్ట్రం ఖర్చెలా అవుతుంది?

కొవిడ్‌ నేపథ్యంలో..ఉచిత బియ్యం, నగదు పంపిణీకి పౌరసరఫరాల సంస్థకు రూ.2657.66 కోట్లను బదిలీ చేసింది. ఇందులో రూ.1004.82 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సం క్షేమ బోర్డు నుంచి తీసుకుని మొత్తాన్ని ఖర్చుల కింద చూపించింది. ఆ నిధులు ఖర్చు కాలేదు కాబట్టి రెవెన్యూ ఖర్చు కింద చూపడం సరికాదని కాగ్‌ స్పష్టంచేసింది.

Read more