వారు ఒక తట్ట మట్టి కూడా పోయలేదు: ajay kumar

ABN , First Publish Date - 2022-05-24T21:27:53+05:30 IST

వారు ఒక తట్ట మట్టి కూడా పోయలేదు: ajay kumar

వారు ఒక తట్ట మట్టి కూడా పోయలేదు: ajay kumar

హైదరాబాద్: కొందరు వలస పక్షులు వస్తున్నాయని ఆరోపణలు చేసి పోతున్నారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి ఒక తట్టా మట్టి కూడా పోయాలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ స్కామ్‌లు చేసిందన్నారు. ఏ రాష్టం ఐతే తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్ని అన్నారో, ఆ రాష్టంలో ఇప్పుడు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతుందన్నారు. దావోస్‌లో ఒక్క రోజునే మంత్రి కేటీఆర్ వేయి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. అదే పక్క రాష్టంలో ఎవరు పెట్టుబడులు పెట్టటం లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. 

Read more