సూర్యాపేటలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2022-10-11T10:16:01+05:30 IST

అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ-2022ను ఈ నెల 15 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ సికింద్రాబాద్‌ ద్వారా నిర్వహించనున్నారు.

సూర్యాపేటలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఈ నెల 15 నుంచి 31 వరకు నిర్వహణ 

అల్వాల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ-2022ను ఈ నెల 15 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ సికింద్రాబాద్‌ ద్వారా నిర్వహించనున్నారు. సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌లో అగ్నిపథ్‌ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ర్యాలీని నిర్వహిస్తున్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌ ఉద్యోగాలకు 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. 2022 అక్టోబరు 1నాటికి 23 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. www.joinindianarmy.nic.in లో  పేర్కొన్న అన్ని పత్రాలు తెచ్చిన అభ్యర్థులను మాత్రమే ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. 

Read more