తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం

ABN , First Publish Date - 2022-09-30T18:10:07+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య మళ్లీ జలవివాదం రాజుకుంది. అవసరం లేకున్నా శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య మళ్లీ జలవివాదం రాజుకుంది. అవసరం లేకున్నా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం (Srisailam Left Bank Power Station)లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన (Telangana Power Generation)పై ఏపీ (AP) అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్‌ (KRMB Chairman)కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (AP Water Resources Department Engineer in Chief) లేఖ రాశారు. శ్రీశైలం (Srisailam), నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar Project)ల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉందని ఏపీ అధికారులు (AP officials) లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన (Telangana hydropower generation) వలన నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయటం వల్ల సీజన్ చివరిలో పంటలు సాగు, తాగునీరుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను ఏపీ అధికారులు కోరారు.


Read more