ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపుపై... ప్రభుత్వానికి ఏఎఫ్‌ఆర్‌సీ నివేదిక

ABN , First Publish Date - 2022-10-05T09:44:03+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపునకు సంబంధించిన నివేదికను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది.

ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపుపై... ప్రభుత్వానికి ఏఎఫ్‌ఆర్‌సీ నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపునకు సంబంధించిన నివేదికను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. ఫీజుల ఖరారు కోసం కమిటీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మంగళవారం నివేదికను రూపొందించింది. దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.


వచ్చే వారం నుంచి గ్రూప్‌-1 హాల్‌టికెట్లు..!

గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎ్‌ససీ) ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న పరీక్ష కేంద్రాలు, వాటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం టీఎ్‌సపీఎ్‌ససీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్లను వచ్చే వారం నుంచి జారీచేయాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులకు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

Read more