వామ్మో.. పెద్దపులి!

ABN , First Publish Date - 2022-11-28T01:15:33+05:30 IST

మండలంలోని పిప్పల్‌ కోటి రిజర్వాయర్‌ పనులు జరుగుతున్న ప్రదేశంలో శనివారం అర్ధరాత్రి పెద్దపులి కనిపించడంతో కూలీ లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

వామ్మో.. పెద్దపులి!
కంకర మిషన్‌ వద్ద సంచరిస్తున్న పెద్దపులి

భయపడిన కూలీలు

భీంపూర్‌, నవంబరు 27: మండలంలోని పిప్పల్‌ కోటి రిజర్వాయర్‌ పనులు జరుగుతున్న ప్రదేశంలో శనివారం అర్ధరాత్రి పెద్దపులి కనిపించడంతో కూలీ లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆపరేట ర్‌ తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి రిజర్వాయర్‌ ప్రాంతంలో కంకరమిషన్‌ వద్ద పనులు చేస్తున్న డోజర్‌ ఆపరేటర్‌కి పెద్దపులి కనిపించడంతో ఒక్కసారిగా భయపడ్డారు. భయం భయంతో తన ఫోన్‌లో పులిఫోటోలను తీశాడు.ఈ విషయాన్ని సద రు కాంట్రాక్టర్‌ తెలిపాడు. వారు అటవీ శాఖ అధికా రులు సమాచారం అందించారు.కొన్ని నెలల నుంచి పెద్దపులి సంచరించడంపై ఇప్పటికే పలుమార్లు కథ నం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా అటవి శాఖ అధికారులు పులిని వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-28T01:15:37+05:30 IST