గాయత్రీ జలపాతం వద్ద ప్రపంచ రాప్లింగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-10-02T04:50:03+05:30 IST

ఇచ్చోడ మండల కేంద్రానికి 20కి.మీల దూరంలో గల దట్టమైన అటవీ ప్రాంతంలో గల గా యాత్రి జలపాతం వద్ద ప్రపంచ రాప్లింగ్‌ పోటీలు శనివారం సాదాసీదాగా ప్రారంభ మయ్యాయి.

గాయత్రీ జలపాతం వద్ద ప్రపంచ రాప్లింగ్‌ పోటీలు
జలపాతం వద్ద రాప్లింగ్‌ దృశ్యం

మూడు రోజుల పాటు నిర్వహణ

నేడు విదేశీ క్రీడాకారుల విన్యాసం


ఇచ్చోడరూరల్‌, అక్టోబరు1: ఇచ్చోడ మండల కేంద్రానికి 20కి.మీల దూరంలో గల దట్టమైన అటవీ ప్రాంతంలో గల గా యాత్రి జలపాతం వద్ద ప్రపంచ రాప్లింగ్‌ పోటీలు శనివారం సాదాసీదాగా ప్రారంభ మయ్యాయి. మూడు రోజుల పాటు జరుగ నున్న ఈ జల విన్యాసాల్లో దేశంలోని వివి ధ రాష్ర్టాలకు చెందిన 50 మంది క్రీడా కారులతో పాటు 17 విదేశీ క్రీడాకారులు పాల్గొననున్నారు. విదేశీయుల విన్యాసం ఆది వారం జరగనున్నాయి.తెలంగాణ అడ్వెంచర్‌ క్లబ్‌ డైరెక్టర్‌ రంగారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి.

తెగిన తాడు.. తప్పిన ప్రమాదం

రాప్లింగ్‌ పోటీల్లో మొదటి రోజు క్రీడాకారుడికి పెను ప్రమాదం తప్పంది. 330 అడుగుల ఎత్తు నుంచి ప్రవహించేనీళ్లతో గాయత్రీ జలపాతం వద్ద రాప్లింగ్‌ పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఒక తాడు కట్టుకొని, మరోతాడును చేతితో పట్టుకొని పైనుంచి కిందికి పడే జలాల నుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. ఈ క్రీడ ఎంతో ప్రమాదమైన సాహసోపేతమైంది. ఖమ్మం జిల్లాకు చెంది న కుమ్మరి ఉపేందర్‌బాబు 330 అడుగుల ఎత్తు నుంచి కిందకుదిగుతుండగా మధ్యలో చేతిలో తాడు తెగిపోయింది. దీంతో అతడి హెల్మెట్‌, వాకిటాకీ నీళ్లలో పడిపోవడంతో ఒక్కసారి ఆందోళన పరిస్థితి ఏర్పడింది. క్రీడాకారుడు కనబడక పోవడంతో జల పాతం వద్ద కింది భాగంలో ఉన్న రెస్క్యూ టీమ్‌ సభ్యులు హడావుడిగా కొండపైకి వెళ్లి అక్కడ ఉన్న రెస్క్యూ సభ్యులకు తెలుప డంతో అందరూ ఆందోళన చెందారు. క్రీడా కారుడికి ఉన్న తాడును లాగడంతో జలపా తం మధ్యలో రెండు రాళ్ల మధ్యన ఇరుకున్న క్రీడాకారుడు క్షేమంగా బయటకు వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more