ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు చైతన్య సదస్సుల జాడేది?

ABN , First Publish Date - 2022-05-31T03:58:02+05:30 IST

వ్యవసాయంలో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం మే నెలలో మన తెలంగాణ - మన వ్యవసాయం పేరుతో అన్ని గ్రామాల్లో చైతన్య సదస్సులు నిర్వహించే వారు. వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు సైతం పాల్గొనేవారు. సాగులో ఏ విత్తనాలు వాడాలి, ఎరువులు ఎంత మోతా దులో వినియోగించాలి, చీడపీడల నివారణకు ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అనే అంశాలపై రైతులకు అవ గాహన కల్పించేవారు. ఐతే మూడేళ్లుగా రైతు చైతన్య సదస్సులు నిర్వహించడం లేదు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు చైతన్య సదస్సుల జాడేది?

- వ్యవసాయంపై రైతులకు సూచనలు కరువు

- అవగాహన కల్పిస్తేనే మేలు

బెజ్జూరు, మే 30; వ్యవసాయంలో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం మే నెలలో మన తెలంగాణ - మన వ్యవసాయం పేరుతో అన్ని గ్రామాల్లో చైతన్య సదస్సులు నిర్వహించే వారు. వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు సైతం పాల్గొనేవారు. సాగులో ఏ విత్తనాలు వాడాలి, ఎరువులు ఎంత మోతా దులో వినియోగించాలి, చీడపీడల నివారణకు ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అనే అంశాలపై రైతులకు అవ గాహన కల్పించేవారు. ఐతే మూడేళ్లుగా రైతు చైతన్య సదస్సులు నిర్వహించడం లేదు. వానాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. అధికారులు మాత్రం గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి.  దీంతో రైతులకు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. రైతులు వారికి నచ్చిన పంటలు వేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. జిల్లాలో అధికంగా పత్తిపంట సాగు చేసేం దుకు మొగ్గు చూపుతున్నారు. రైతులంతా వర్షాధారం పైనే ఆధారపడి సాగు చేస్తారు. రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతు సయన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ఐతే ఇంత వరకు వాటితో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

అవగాహన లేమితో నష్టాలు

ప్రభుత్వం రైతులకు సాగులో వివిధ రకాల సూచనలు అందించినప్పుడే వారు అన్ని విధాల లాభం పొందుతారు. రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోతుండ టంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రతి ఏటా రైతు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నందున వారికి సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నం దున అధికారులు వాటికే సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రభుత్వం కూడా సదస్సులపై ఎలాంటి ప్రకటన చేయని కారణంగా సాగులో రైతులకు సలహాలు, సూచనలు అంద కుండా పోతోంది. ప్రభుత్వం స్పందించి సాగులో సలహాలు, సూచనలతో పాటు ఎలాంటి పంటలు ఏ సమయంలో వేయాలి అనే దానిపై అవగాహన కల్పించా లని రైతులు కోరుతున్నారు.

జిల్లాలో సాగు విధానం

జిల్లాలో ఈ ఏడాది రైతాంగం అధికంగా పత్తి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం పదిహేను మండలాల పరిధిలో అత్యధికంగా 3.50లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 54వేల ఎకరాల్లో వరి, 40వేల ఎకరాల్లో కంది. పదివేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే జిల్లాలో అధికంగా రైతులు నిరక్ష్యరాస్యులే కావడంతో వారికి పంటల సాగులో సరైన మెలకువలు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  భూసార పరీక్షల ఆవశ్యకత, పంట మార్పిడి పద్ధతి, పునరావాస పంటల గురించి, ఆధునిక పద్ధతిలో సాగు విధానం, ఏ సమయంలో ఏ పంటలు వేసుకోవాలి అనే విషయంపై గ్రామాల్లోని రైతులకు ఎలాంటి  సూచనలు అందడం లేదు. దీంతో మూడేళ్లుగా రైతులు వారికి ఇష్టం వచ్చిన పంటలను సాగు చేసి నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతు చైతన్య సదస్సులపై ఎలాంటి ప్రక టన విడుదల చేయడం లేదు.

యేటా నిర్వహించాలి

- కుమ్మరి శంకర్‌,  రైతు, బెజ్జూరు

రైతు చైతన్య సదస్సుతో ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం రైతు చైతన్య సదస్సులు నిర్వహించాలి. సాగు పద్ధతులు తెలుసుకోవడం వల్ల రైతులకు అనేక ఉపయోగాలున్నాయి. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవ సాయం చేయడం, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు సాధించేందుకు చైతన్య సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయి. 

రైతు వేదికల్లోనే అవగాహన కార్యక్రమాలు

-రాజులనాయుడు, ఏవో 

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగులో సలహాలు, సూచ నలు అందించేందుకు గ్రామాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారానే తమ సిబ్బంది రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేసి వ్యవసాయంలో అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలు ఏయే పంటలు వేయాలో రైతులకు సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నాం.

Read more