జలవనరుల శాఖలో జీతాలెప్పుడు?

ABN , First Publish Date - 2022-11-24T22:35:48+05:30 IST

జలవనరుల శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తొమ్మిది నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించక పోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.

జలవనరుల శాఖలో జీతాలెప్పుడు?

మంచిర్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తొమ్మిది నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించక పోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా నామమాత్రపు వేతనాలకు సేవలందిస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌ నగర్‌ పరిధిలో రెండు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూ సేకరణ) విభా గంలో కంప్యూటర్‌ ఆపరేటర్లు 15 మంది, 21 మంది వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌లతో కలిపి 50 మంది ఉద్యోగులు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. జిల్లాకు ఒక సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, రెండు జిల్లాలకు కలిపి ఒక చీఫ్‌ ఇంజనీర్‌ ఉన్నారు. వీరికి తొమ్మిది నెలలుగా వేతనాలు నిలిచిపోవ డంతో నిరాశ గురవుతున్నారు. కొన్ని కుటుంబాల్లో పూటగడవడమే కష్టంగా మారి అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. జలవనరుల శాఖలో విధులు నిర్వహిస్తూ భూ సేకరణ, పంటలకు సాగు నీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రెండు జిల్లాల పరిధిలో

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రెండు జిల్లాల్లో కలిపి దాదాపు కోటి రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగి నెలకు రూ. 19,500 ఉండగా తొమ్మిది నెలలుగా నయా పైసా విడుదల చేయలేదు. దీంతో పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. 50 మంది వేతనాలు, ఇతర అలవెన్సులు కలిపి మొత్తంగా కోటి రూపాయలు రావలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీస అవసరాలకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నాయి.

అప్పుల భారం..

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు రవాణా ఖర్చు లకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ముందు చూపు లేకుండా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చేసిన నిర్వాకం వల్లే ఈ దుస్థితి తల్తెతిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా, ఆఫీస్‌ స్టాఫ్‌గా, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పలు రకాల సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక శాఖకు యేటా బడ్జెట్‌ రూపకల్పన సమయంలో ముందస్తు అంచనాలతో ఏ మేరకు నిధులు అవసరం ఉంటుందో నివేదిక అందజేయాల్సిన ఉన్నతాధికా రులు పట్టించుకోక పోవడం వల్లే వేతనాలు నిలిచిపోయి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ బడ్జెట్‌ లేక వేతనాలు ఆలస్యం

- శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదలశాఖ సీఈ

ఎల్‌వోసీ, బడ్జెట్‌ కేటాయింపులు లేనందున వేతనాల చెల్లింపులలో ఆలస్యం జరుగుతోంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నవం బర్‌ మొదటి వారంలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకా శం ఉంది. నిధులు విడుదల కాగానే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం.

Updated Date - 2022-11-24T22:35:48+05:30 IST

Read more