శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం

ABN , First Publish Date - 2022-09-09T04:41:26+05:30 IST

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైనవిద్యతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు.

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం
పెంచికలపేటలో హాజరు రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న పీవో వరుణ్‌రెడ్డి

- ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

పెంచికలపేట, సెప్టెంబరు 8: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైనవిద్యతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఎల్లూరుగిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలను ఆయన తనిఖీచేశారు. పాఠ శాలలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని పరిశీలించి విద్యా ర్థులకు అందిస్తున్న వైద్యచికిత్సలను అడిగి తెలుసుకు న్నారు. రక్తనమునాలను సేకరించి పరీక్షలు చేసి నివేది కలను సమర్పించాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. 

ఆసిఫాబాద్‌ రూరల్‌: ఆసిఫాబాద్‌ పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికలరెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశా లను ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి శుభ్రతను పాటించా లని, మెనూప్రకారం భోజనం అందించాలని సూచిం చారు. అనంతరం ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులతో సమా వేశమై సబ్జెక్టుల వారీగా విద్యాబోధన, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, ఆరోగ్యంపై పలుసూచనలు చేశారు.

Read more