త్వరలోనే ఇండ్ల పట్టాలు అందజేస్తాం

ABN , First Publish Date - 2022-09-20T03:48:17+05:30 IST

పట్టణంలో ఎన్నో ఏండ్లుగా ఇండ్లు నిర్మించుకున్న వారికి త్వరలోనే పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం పలు వార్డుల్లో ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు కార్డులను అందజే శారు. ఇండ్ల పట్టాల విషయంపై మరో రెండు రోజుల్లో అధికారులు సర్వే చేపడ తారని పేర్కొన్నారు.

త్వరలోనే ఇండ్ల పట్టాలు అందజేస్తాం
కాల్‌టెక్స్‌లో ఆసరా పింఛన్‌ కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, సెప్టెంబరు 19: పట్టణంలో ఎన్నో ఏండ్లుగా ఇండ్లు నిర్మించుకున్న వారికి త్వరలోనే పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం పలు వార్డుల్లో ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు కార్డులను అందజే శారు. ఇండ్ల పట్టాల విషయంపై మరో రెండు రోజుల్లో అధికారులు సర్వే చేపడ తారని పేర్కొన్నారు. పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కరిస్తానని, పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పట్టణ ప్రజలను పలు విషయాల్లో తప్పుదోవ పట్టించేందుకు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వీటిని నమ్మవద్దని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, కౌన్సిలర్లు నెల్లి శ్రీలత, సముద్రాల లావణ్య, నాయకులు పాల్గొన్నారు.  

Read more