వ్యాపారులకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2022-10-12T03:29:14+05:30 IST

మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కన దశాబ్దాలుగా చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు.

వ్యాపారులకు న్యాయం చేస్తాం
ఎంపీ సోయబాపురావుకు తమ గోడును వెల్లబోసుకుంటున్న చిరు వ్యాపారులు

- ఎంపీ సోయం బాపురావు 

రెబ్బెన, అక్టోబరు 11: మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారి పక్కన దశాబ్దాలుగా చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు.   మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు మంగళవారం బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్‌ కిరణ్‌కుమార్‌, బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌కు వెళ్లి సోయం బాపురావుకు తమ వ్యాపార సముదాయాలు  కోల్పోకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు. . ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యాపారులు శ్రీధర్‌, సంతోష్‌, మాణిక్యారావు, సురేష్‌, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more