పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-11-20T22:56:48+05:30 IST

పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పోడు భూముల రైతులకు పట్టాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ్య అన్నారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 20 : పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పోడు భూముల రైతులకు పట్టాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ్య అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార ్యవర్గ సమావేశాన్ని కనిగారపు అశోక్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు సర్వే చేసి గ్రామసభల ద్వారా నిర్ణయిం చేయాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, గోమాస ప్రకాష్‌, కనిగారపు అశోక్‌, ఎర్మ పున్నం, దుంపల రంజిత్‌కుమార్‌, దాసరి రాజేశ్వరి, దూలం శ్రీనివాస్‌, చందు, రాజారాం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T22:56:48+05:30 IST

Read more