అర్హులందరికీ పోడు భూముల పట్టాలు

ABN , First Publish Date - 2022-09-30T03:39:53+05:30 IST

అర్హులైన పోడు రైతు లందరికి పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం వెంకటాపూర్‌లో నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. ప్రభుత్వం పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు.

అర్హులందరికీ పోడు భూముల పట్టాలు
వెంకటాపూర్‌లో సర్వేను పరిశీలిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి 

కాసిపేట, సెప్టెంబరు 29: అర్హులైన పోడు రైతు లందరికి పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి  అన్నారు. గురువారం వెంకటాపూర్‌లో నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. ప్రభుత్వం పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు. అటవీ హక్కు చట్టం ప్రకారం సాగు భూములను గుర్తించి అర్హులైన వారికి పట్టాదారు పాసుబుక్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధి కారులు సమన్వయంతో దరఖాస్తులను పరిశీలించి సర్వే పనులను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశిం చారు. సర్వే వివరాలను రిజిష్టర్‌లలో నమోదు చేయా లని సూచించారు. వెంకటాపూర్‌ సర్పంచు ఆడె సౌం దర్యశంకర్‌ గిరిజన గూడాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మౌలిక సదుపా యాలు కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పం దించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీని వాస్‌, ఎంపీవో నాగరాజు, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌రావు, కార్య దర్శులు, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ చైర్మన్‌ ఆడె శంకర్‌, సభ్యులు పాల్గొన్నారు. 

సమన్వయంతో సర్వే చేపట్టాలి  

బెల్లంపల్లి రూరల్‌:  భూముల సర్వేను అధికారులు సమన్వయంతో చేపట్టాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. గురువారం కన్నాల, పెర్కపల్లి గ్రామ పంచాయతీలో  మొబైల్‌ యాప్‌ ద్వారా చేపట్టిన సర్వేను పరిశీలించారు. పీవో మా ట్లాడుతూ భూ సర్వేను పకడ్బందీ గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తహసీ ల్దార్లు,  కార్యదర్శులు, అటవీ శాఖ సిబ్బంది సమన్వ యంతో నిర్వహించాలని తెలిపారు. సర్వేలకు సంబం ధించిన పూర్తి వివరాలను రికార్డు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు సంబం ధించిన భూమి హద్దులు, ప్రాంతం వివరాలను నమో దు చేసుకున్నారు.  నిర్దేశించిన సమయం లోగా పూర్తి చేయాలని, సమస్యలు తలెత్తినప్పుడు అధికారులకు తెలుపాల న్నారు. ఎఫ్‌ఆర్‌వో గౌరిశంకర్‌, ఎంపీడీవో రాజేందర్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, వీరబాబు, కో ఆప్షన్‌  అశోక్‌గౌడ్‌, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.    

 

Read more