అహింసా మార్గంలో నడవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-03T05:44:08+05:30 IST

గాంధీజీ సూచించిన బహుళ సూత్రాల ను ప్రతీఒక్కరు ఆచరించడంతో పాటు అహింసా మార్గంలో నడవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్‌ కార్యాలయంలో స్థానిక అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాతో కలిసి గాంధీ చిత్రపటం వద్ద కలెక్టర్‌ నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ

అహింసా మార్గంలో నడవాలి : కలెక్టర్‌
జిల్లా జైలులో మొక్క నాటి నీళ్లు పోస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

జిల్లావ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి

ఆదిలాబాద్‌ టౌన్‌, అక్టోబరు 2: గాంధీజీ సూచించిన బహుళ సూత్రాల ను ప్రతీఒక్కరు ఆచరించడంతో పాటు అహింసా మార్గంలో నడవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్‌ కార్యాలయంలో స్థానిక అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాతో కలిసి గాంధీ చిత్రపటం వద్ద కలెక్టర్‌ నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని నిరూపించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి హరితహారం, పల్లెప్రగతి, పరిశుభ్రత వంటి కార్యక్ర మాలతో పాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్‌ నటరాజ్‌ మాట్లాడుతూ సత్యాగ్రహం, అహింస, భిన్నత్వంలో ఏకత్వం వంటి సిద్ధాం తం ద్వారా గాంధీజీ స్వాతంత్రం సాధించి పెట్టారని అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మాట్లాడుతూ గాంధీజి, లాల్‌ బహదూర్‌శాస్ర్తీలు దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అహింస అనే ఆయుధంతో  స్వాతంత్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ఫ్రీడం పార్కులను కలెక్టర్‌ ప్రారంభించారు. ఇందులో ఆర్డీవో రాథోడ్‌రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైల జ, వార్డు కౌన్సిలర్‌ వెంకన్న, కలెక్టరేట్‌ ఏవో అరవింద్‌కుమార్‌, ప్రజా ప్రతి నిధులు, కలెక్టరేట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

అలాగే, మహాత్ముడి జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం గా జరుపుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా జైల్‌ లో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో ఎస్పీ ఉదయ్‌ కుమార్‌రెడ్డి, జైళ్ల శాఖ డీఐజీ, జైలు సిబ్బందితో కలిసి కలెక్టర్‌ మొక్కలు నాటారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంతో వజ్రోత్సవాలు, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు, పండుగలు, గాంధీ జయంతి వేడుకలను నిర్వహంచుకుం టున్నామన్నారు. ఖైదీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, ఖైదీలు పరివర్తన చెందడానికి పలు సంక్షేమ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జైలులో జిల్లా యంత్రాంగం నుంచి నిధులు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇందులో జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్‌, జిల్లా లీగల్‌ సర్వీస్‌ ఆథారిటి కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, డీఎంఅండ్‌హెచ్‌ఓ నరేందర్‌రాథోడ్‌, జైల్‌ పర్యవేక్షకులు అశోక్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

ఉట్నూర్‌: మహాత్మాగాంధీ ఆశయాల సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఐటీడీఏ పీవో కే.వరుణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఉట్నూర్‌ ఐటీ డీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పీవో అధికారులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీవో మాట్లాడుతూ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకున్నామని అన్నారు. ఇందులో ఏపీవో జనరల్‌ కినక భీంరావు, ఈఈ రాథోడ్‌ భీంరావు, పీవీటీజీ బాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయా లతో పాటు తదితరులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు.  

మావల: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను మావల, ఆది లాబాద్‌ రూరల్‌ మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయ ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీచిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా రూరల్‌ ఎంపీపీ గండ్రత్‌రమేష్‌ మాట్లాడుతూ గాంధీ అహంస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించామన్నారు. ప్రతీ ఒక్కరు మహాత్ముడి ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

జైనథ్‌: మండలంలోని 42 గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు మండలంలోని దీపాయిగూడ జైనథ్‌ గ్రామాల్లో జాతి పిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిం చడంతో పాటు అర్హులైన వృద్ధుల, వితంతువులు, వికలాంగులకు పెన్షన్‌ లను అందజేశారు. ఇందులో జైనథ్‌దీపాయిగూడ సర్పంచ్‌లు డి.దేవన్న, బొల్లిగంగన్న, ఉప సర్పంచ్‌ కృస్ణారెడ్డి, పెన్షన్‌ లబ్ధిదారులు పాల్గొన్నారు.

అలాగే, జైనథ్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 70వ రోజుకు చేరింది. వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ను అమలు చేయాలని చనిపోయిన వీఆర్‌ఏల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించాలని, తదితర డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ చిత్రపటానికి వీఆర్‌ఏలు సమర్పించారు. 

గుడిహత్నూర్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని ఎస్సై ఎల్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తల్లి పిలుపు, టిప్పు సుల్తాన్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, మండల వైద్య అధికారి డా.నిలోఫర్‌ ప్రారంభించారు. ఇందలో కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జమీర్‌, తల్లి పిలుపు జిల్లా కోఆర్డినేటర్‌ లోకండే అనిల్‌, టిప్పు సుల్తాన్‌ యూత్‌ అధ్యక్షు డు వసీంఖాన్‌, సభ్యులు ఇమ్రాన్‌ఖాన్‌, అర్షద్‌ఖురేషి పాల్గొన్నారు 

సిరికొండ: జాతిపిత మహత్మా గాంధీ 153వ జయంతి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రంలోని పలు పార్టీల కా ర్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్యాలయాలతోపాటు ఆయా గ్రామ పం చాయతీలలో ప్రజాప్రతినిఽధులు, అధికారులు గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పెందూర్‌ లక్ష్మీబాయి గంగాధర్‌, మడావి గంగారాం, ఓరుగంటి నర్మదా పెంటన్న, కదం శకుంతలబాయి, తదితరులు పాల్గొన్నారు. 

Read more