స్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి

ABN , First Publish Date - 2022-01-24T03:58:59+05:30 IST

స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుం డాలని, కరోనా విపత్కర కాలంలో వారు అందించిన సేవలు గొప్పవని ఆర్డీవో శ్యామలాదేవి, జిల్లా సంక్షేమశాఖ అధికారి ఉమాదేవిలు పేర్కొన్నారు. ఆదివా రం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా సింగరేణి కళావేదికలో లాక్‌ డౌన్‌ సమయంలో సేవలందించిన సామాజిక సేవకులను సన్మానించారు.

స్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి
సన్మానిస్తున్న ఆర్డీవో, జిల్లా సంక్షేమాధికారి

బెల్లంపల్లి, జనవరి 23: స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుం డాలని, కరోనా విపత్కర కాలంలో వారు అందించిన సేవలు గొప్పవని  ఆర్డీవో శ్యామలాదేవి, జిల్లా సంక్షేమశాఖ అధికారి ఉమాదేవిలు పేర్కొన్నారు. ఆదివా రం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా సింగరేణి కళావేదికలో లాక్‌ డౌన్‌ సమయంలో సేవలందించిన సామాజిక సేవకులను సన్మానించారు.  సుభాష్‌చంద్రబోస్‌, స్వామివివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా సమయంలో సేవలందించిన వారిని గుర్తించి కరోనా యోధులు సామాజిక సేవకులు అనే బిరుదుతో అభినవ స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ యువజన సంఘాల సమితి జిల్లాలోని 70 మందికి పురస్కారాలు అందించడం గొప్ప విషయమన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి బొబ్బిలి శ్రీకాంత్‌, జిల్లా యువజన సంఘాల గౌరవాధ్యక్షుడు గజెల్లి మోహన్‌, డీసీపీవో ఆనంద్‌, లయన్‌ మధుసూదన్‌రెడ్డి, హనుమాండ్ల మధుకర్‌, రేణికుం ట్ల శ్రీనివాస్‌, షేక్‌ ముక్తార్‌, విజయ్‌, సుప్రజ, నాగేష్‌, శ్రీనివాస్‌,  పాల్గొన్నారు. 

Read more