నేటి తరం శిల్పులకు మూలపురుషుడు విశ్వకర్మ

ABN , First Publish Date - 2022-09-18T04:48:34+05:30 IST

నేటి తరం శిల్పులకు మూల పురుషుడు విశ్వకర్మ అని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు.

నేటి తరం శిల్పులకు మూలపురుషుడు విశ్వకర్మ
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 17: నేటి తరం శిల్పులకు మూల పురుషుడు విశ్వకర్మ అని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యేటా సెప్టెంబరు 17న దేవశిల్పి విశ్వకర్మ పూజను జరుపుకుంటారన్నారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో తప్పకుండా నిర్వహిస్తారని తెలిపారు. దాసనాపూర్‌లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  అర్చకులు తిరుపతి, ఉపేందర్‌ల ఆధ్వర్యంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, డీఆర్‌ఓ సురేష్‌, ఎంపీపీ మల్లికార్జున్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సుహాసిని, సతీష్‌ బాబు, కాండ్రె విశాల్‌, విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు తుమోజు సురేష్‌ చారి, నాయకుల శ్రీమంతుల వేణుగోపాలచారి, జిల్లా కార్యదర్శులు భాస్కరచారి, అశోక్‌, నాయకులు వెంకటేష్‌, వెంకటయ్య, రమేష్‌, ప్రభాకర్‌, రాధాకృష్ణచారి, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more