విష్ణుమూర్తి.. అందరికీ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-01T04:26:28+05:30 IST

రెండు కాళ్లు లేకపోయినా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన విష్ణుమూర్తి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విష్ణుమూర్తి డిగ్రీ చదువుతూనే తల్లిదండ్రులకు అన్ని పనుల్లో సాయం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒకసారి వారి పొలంలో వరికోస్తున్న సమయంలో ధాన్యం తీస్తా నని చెప్పి క్రషర్‌పై ఎక్కాడు.

విష్ణుమూర్తి.. అందరికీ స్ఫూర్తి
కృత్రిమ కాళ్లతో ట్రాక్టర్‌ నడిపిస్తున్న విష్ణుమూర్తి

- మనోధైర్యం ముందు అంగవైకల్యం ఓటమి

- రెండు కాళ్లు లేకున్నా.. అన్ని పనుల్లో ముందుకు

కౌటాల, జూలై 31: రెండు కాళ్లు లేకపోయినా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన విష్ణుమూర్తి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విష్ణుమూర్తి డిగ్రీ చదువుతూనే తల్లిదండ్రులకు అన్ని పనుల్లో సాయం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒకసారి వారి పొలంలో వరికోస్తున్న సమయంలో ధాన్యం తీస్తా నని చెప్పి క్రషర్‌పై ఎక్కాడు. ప్రమాదవశాత్తు అతని రెండు కాళ్లు క్రషర్‌లో పడి నుజ్జునుజ్జు అయ్యాయి. డాక్టర్లు కాళ్లు సగానికి తొలగించారు. అయినా అందరి లాగా కాళ్లు లేవని కుంగిపోకుండా కృత్రిమ కాళ్లతో తాను స్వతహా అన్ని పనులు చేయ గలనని నిరూపిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. మనోధైర్యం ఉంటే ఎంతటి అంగ వైకల్యం అయినా జయించవచ్చని నిరూపిస్తున్నాడు.

ప్లాస్టిక్‌ కాళ్లతో పొలానికి..

రెండు కాళ్లు పోయినా విష్ణు ఆత్మసైర్థ్యం మాత్రం కోల్పోలేదు. స్థానిక ఎమ్మెల్యే చేసిన సాయంతో జర్మనీ టెక్నాలజీతో తయారు చేసి రెండు ఆర్టిఫిషియల్‌ కాళ్లను పెట్టుకుంటున్నాడు. ఆరు నెలలు కాస్త కష్టపడ్డాడు. ఆ తరువాత కృత్రిమకాళ్లతో నడవడం అలవాటు చేసుకు న్నాడు. నడవడమే కాదు. అన్ని పనులూ చేసేస్తున్నాడు. ఆదర్శ యువరైతుగా మారాడు. కృత్రిమ కాళ్లతోనే ద్విచక్ర వాహనం నడపడం, పంటలకు నీళ్లు పెట డం, కలుపు తొలగించడంతోపాటు పంటలకు మందులు పిచికారి చేయడం, ట్రాక్టర్‌ నడపడం, పశువుల ఆలనాపాలన చూడడం, ఒక్కటేమిటి అన్ని పనులు అందరిలాగానే చేస్తూ శభాష్‌ అని పించుకుంటున్నాడు. వైకల్యం ఉన్నా కుటుంబానికి భారం కావద్దని పేదతల్లిదండ్రులకు అండగా ఉంటూ వ్యవవసాయ పనులు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

ధైర్యంతో ముందుకు వెళ్తున్నా

- విష్ణుమూర్తి

 ప్రమాదవ శాత్తు క్రషర్‌లో పడి కాళ్లు కోల్పో యాను. సంఘ టను తల్చుకుం టూ బాధప డుతూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదు కదా. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో కృత్రిమ కాళ్లు అమర్చారు. కుటుంబ సభ్యులకు నావంతు సాయం చేసేందుకు కృత్రిమ కాళ్లతో అన్నిపనులు చేసుకోగలగుతున్నాను. నాకు నా కుటుంబసభ్యులతోపాటు ఎమ్మెల్యే కోనప్ప రెండో జన్మ ఇచ్చారు.

Read more