గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2022-06-08T04:15:44+05:30 IST

గ్రామాల అభివృద్ధే ద్యేయంగా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యాక్రమాలు చేపడుతోందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంగళవారం ఆమె పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం
కాలనీల్లో పర్యటిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

 - జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, జూన్‌ 7: గ్రామాల అభివృద్ధే ద్యేయంగా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యాక్రమాలు చేపడుతోందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంగళవారం  ఆమె పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. కాగా మండలంలోని గోవింద్‌పూర్‌, గుండి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌లు హాజరయ్యారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలువేరు వెంకన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 

Read more