అక్రమ దత్తత జరగకుండా నిఘా పెంచాలి

ABN , First Publish Date - 2022-09-27T04:57:38+05:30 IST

అక్రమదత్తత జరగ కుండా నిఘాపెం చాలని అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ విభాగాన్ని సందర్శించి కమిటీసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అక్రమ దత్తత జరగకుండా నిఘా పెంచాలి
బాలరక్ష వాహనాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి

- అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26: అక్రమదత్తత జరగ కుండా నిఘాపెం చాలని అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ విభాగాన్ని సందర్శించి కమిటీసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎంతమంది కొవిడ్‌ బాధిత అనాథలు ఉన్నారని వారి సంక్షేమానికి తీసుకుం టున్న చర్యలు ఏమిటని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్‌, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ వెంకట స్వామిని అడిగి తెలుసుకున్నారు. బాలల సంక్షేమ కమిటీలను బలోపేతం చేయాలని, ఖచ్చితంగా సమావేశాలు నిర్వహించాల న్నారు. అక్రమదత్తత జరగకుండా నిఘాపెంచి చట్టబద్దమైన దత్తత పైన ఎక్కువగా అవగాహన కల్పించాల న్నారు. అనంతరం బాలరక్ష భవన్‌ వాహ నాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సభ్యులు డేవిడ్‌, సమీరుల్లాఖాన్‌, దశ రథం, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more