న్యాయం చేయాలని బాధితుల ఆందోళన

ABN , First Publish Date - 2022-11-28T22:49:11+05:30 IST

తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇందారం గ్రామపంచాయతీలోని నజీర్‌పల్లె, దొరగారిపల్లె గ్రామాలకు చెందిన పలువురు బాధితులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

న్యాయం చేయాలని బాధితుల ఆందోళన
జైపూర్‌లోని భూమి పత్రాలతో నిరసన తెలుపుతున్న బాధితులు

జైపూర్‌, నవంబరు 28: తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇందారం గ్రామపంచాయతీలోని నజీర్‌పల్లె, దొరగారిపల్లె గ్రామాలకు చెందిన పలువురు బాధితులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడు తూ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలోని నజీర్‌పల్లెలో 48,49 సర్వే నంబర్లు, దొరగారిపల్లెలోని 216,217,1113 సర్వేనంబర్లలోని భూములను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోనె వెంకట ఆనందకృష్ణ రెవె న్యూ అధికారులతో కుమ్మక్కై తాము నివాసం ఉంటున్న ఇండ్ల పట్టాల భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకున్నాడని ఆరోపించారు. గోనె వెంకట ముత్యంరావు దొర వద్ద 40 సంవత్సరాల క్రితం డబ్బులు ఇచ్చి భూములు కొన్నామని బాధితులు చెప్పారు. కొన్న భూమిలో గతంలోనే ఇళ్లను నిర్మించుకున్నామని చెప్పారు. గోనె వెంకట ఆనంద కృష్ణ పేరు మీద ఉన్న పట్టా భూములను రద్దు చేసి గత కొన్ని సంవత్సరాలుగా కాస్తు, ఇళ్లు కట్టుకుని ఉంటున్న వారికి ఎలాంటి షరతులు లేకుండా రిజిష్ర్టేషన్‌ చేయాలని బాధితులు కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అరికె సంతోష్‌యాదవ్‌, సుంకరి శ్రీనివాస్‌, రత్నం రాకేష్‌రెడ్డి, బాధితులు నిక్కూరి మల్లయ్య, చిలక రాజం, కొప్పుల రాజం, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T22:49:12+05:30 IST