ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలి

ABN , First Publish Date - 2022-05-25T04:20:36+05:30 IST

ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలి
డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులు

- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌

ఆసిఫాబాద్‌, మే 24: ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు.  ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి డిపో గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై రోజురోజుకు అధికారుల వేధింపుల పెరిగిపోతున్నాయని చెప్పారు. కార్మికుల పెండింగ్‌ సమస్యలను వెం టనే పరిష్కరించాలన్నారు. రిటైర్‌మెంట్‌ కార్మికుల డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. సకలజనుల సమ్మె వేతన బకాయిలు చెల్లిం చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు దివాకర్‌, అశోక్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌, సురేష్‌, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more