అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-03T04:54:19+05:30 IST

మండల కేంద్రానికి చెందిన వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కౌటాల సీఐ బుద్ధేస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని శివలింగాపూర్‌కు చెందిన ప్రహ్లాద్‌, లహనుబాయి దంపతుల రెండో కూతురు సంధ్య(20)ను మండల కేంద్రానికే చెందిన రౌతు జయంతుకు ఇచ్చి గత సంవత్సరం నవంబర్‌ 14న వివాహం జరిపించారు.

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
సంధ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ కరుణాకర్‌

కౌటాల, అక్టోబరు 2: మండల కేంద్రానికి చెందిన వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కౌటాల సీఐ బుద్ధేస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని శివలింగాపూర్‌కు చెందిన ప్రహ్లాద్‌, లహనుబాయి దంపతుల రెండో కూతురు సంధ్య(20)ను మండల కేంద్రానికే చెందిన రౌతు జయంతుకు ఇచ్చి గత సంవత్సరం నవంబర్‌ 14న వివాహం జరిపించారు. పెళ్లైన కొద్ది రోజులకే సంధ్య అత్తగారి ఇంట్లో.. పెళ్లికి సంబంధించిన కల్యాణలక్ష్మి డబ్బులు, వరకట్నం తదితరాలతో గొడవల కారణం గా రెండు నెలలు తల్లిగారింటికి వెళ్లింది. తరువాత కులపెద్దలు, తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో అత్తగారింటికి వెళ్లింది. ఈక్రమంలో భార్య భర్తలు ఇద్దరూ ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లి అక్కడే ఉంటున్నారు. దసరా పండుగ సందర్భంగా దంపతులు నాలుగురోజుల క్రితం స్వగ్రా మమైన కౌటాలకు వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో సంధ్య తిరిగి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం జయంత్‌ ఇంటివద్ద కులపెద్దల సమక్షంలో మాట్లాడుతున్న సమయంలో అత్తగారి ఇంటి వారి మాటలకు మనస్థాపానికి గురైన సంధ్య అక్కడి నుంచి తల్లిగారి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి ప్రహ్లాద్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ తెలిపారు. కాగా సంధ్య మృతదేహాన్ని కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌,  తహసీల్దార్‌ రాంలాల్‌ సందర్శించి వివరాలను అడిగి తెలుసు కున్నారు.

Updated Date - 2022-10-03T04:54:19+05:30 IST