కస్తూర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-09-09T04:39:56+05:30 IST

మండల కేంద్రంలోని కస్తూర్బాపాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో 6వ తరగతికి చెందిన స్వాతి, తొమ్మిదవ తర గతికి చెందిన అనూష అనే ఇద్దరు విద్యార్థినులు అస్వస్తతకు గురయ్యారు.

కస్తూర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత
విద్యార్థినులను ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

రెబ్బెన, సెప్టెంబరు 8: మండల కేంద్రంలోని కస్తూర్బాపాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో 6వ తరగతికి చెందిన స్వాతి, తొమ్మిదవ తర గతికి చెందిన అనూష అనే ఇద్దరు విద్యార్థినులు అస్వస్తతకు గురయ్యారు. వెంటనేవీరిని రెబ్బెన పీహెచ్‌సీకి తరలించారు. స్వాతితోపాటు అనూష శ్వాసతీసుకునేందుకు ఇబ్బందిపడుతుండగా వైద్యులు చికిత్స అందించారు. స్వాతిపరిస్థితి ఇబ్బందికరంగా ఉండ డంతో మంచిర్యాలకు తరలించారు. విద్యార్థులు అస్వ స్తతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీసంతోష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజవ్‌ కుమార్‌, విద్యార్థులను పరామర్శించారు.

Read more