రెండు జిల్లాల్లో Covid కేసులు నిల్

ABN , First Publish Date - 2022-03-16T18:37:44+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1254 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 530మందికి పరీక్షలు నిర్వహించగా ఎవ్వరికీ పాజిటివ్‌

రెండు జిల్లాల్లో Covid కేసులు నిల్

ఖమ్మం/కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1254 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 530మందికి పరీక్షలు నిర్వహించగా ఎవ్వరికీ పాజిటివ్‌ రాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మంగళవారం ఎవ్వరూ చేరలేదు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు. 318బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  

Read more