జోడేఘాట్‌ను సందర్శించి ట్రైనీ ఐఏఎస్‌లు

ABN , First Publish Date - 2022-10-01T03:26:21+05:30 IST

కుమరంభీం పోరాటక్షేత్రాన్ని శుక్ర వారం ట్రైనీఐఏఎస్‌లు సందర్శిం చారు. ఈసందర్భంగా భీంవిగ్రహా నికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజి యంలో ఏర్పాటు చేసిన గిరిజన కళాఖండాలు, గుస్సాడీ నృత్యాల ప్రతిమలు ఆసక్తిగా తిలకించారు.

జోడేఘాట్‌ను సందర్శించి ట్రైనీ ఐఏఎస్‌లు
జోడేఘాట్‌ను సందర్శిస్తున్న ట్రైనీ ఐఏఎస్‌లు

కెరమెరి, సెప్టెంబరు 30: కుమరంభీం పోరాటక్షేత్రాన్ని శుక్ర వారం ట్రైనీఐఏఎస్‌లు సందర్శిం చారు. ఈసందర్భంగా భీంవిగ్రహా నికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజి యంలో ఏర్పాటు చేసిన గిరిజన కళాఖండాలు, గుస్సాడీ నృత్యాల ప్రతిమలు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గిరిజన ఆచార వ్యవహరాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం చేసి, ఆహార అలవాట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

జైనూరు: మండలంలోని మార్లావాయి గ్రామాన్ని ట్రైనీఐఏఎస్‌లు శుక్రవారం సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ దంపతుల విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అలాగేపద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Read more