నేడు శివ వినాయక ఆలయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-12-02T00:42:16+05:30 IST

మండలంలోని మునిపెల్లిలో గల శివ వినాయక ఆలయ వార్షికో త్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.

నేడు శివ వినాయక ఆలయ వార్షికోత్సవం
ఆలయంలో గల వినాయకుడు, శివలింగం

లక్ష్మణచాంద, డిసెంబరు 1 : మండలంలోని మునిపెల్లిలో గల శివ వినాయక ఆలయ వార్షికో త్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకపూజలు జరుగ నున్నాయి. వార్షికోత్సవ ఏర్పాట్ల కోసం టీడీపీ జిల్లా నాయకులు చిదుగు భీంరెడ్డి రూ.10 వేలు విరాళంగా ఇచ్చారు. ఇందుకోసం గ్రామాభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవానికి హాజరైన భక్తులు, ప్రజలకు ప్రముఖ స్ర్తీ వైద్య నిపుణురాలు అయిండ్ల స్వర్ణారెడ్డి సహకారంతో అన్నదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కమల్‌కోట పద్మ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-02T00:42:17+05:30 IST