ముగ్గురు దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-11-12T00:12:23+05:30 IST

జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్‌లలో దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను 1వ టౌన్‌ పోలీసులు పట్టుకున్నట్లు నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ముగ్గురు దొంగల అరెస్టు

ఖిల్లా, నవంబరు 11: జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్‌లలో దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను 1వ టౌన్‌ పోలీసులు పట్టుకున్నట్లు నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో వివరాలను వెల్లడించారు. ఈ నెల 6వ తేది తెల్లవారుజామున జిల్లాకేంద్రంలోని కొత్త మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో గల హ్యాపి మొబైల్‌షాప్‌ తాళాలు పగలగొట్టి మొబైల్‌ఫోన్‌లను ఎత్తుకెళ్లినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు 1వ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలించారన్నారు. ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులైన భీంగల్‌కు చెందిన సుంకెట తేజ, మైలారం గ్రామం ధర్పల్లి మండలానికి చెందిన ఆలకుంట మహేష్‌, జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ గ్రామానికి చెందిన ఒడ్డె అలీయాస్‌ దండ్ల రాములపై నిఘాపెట్టి వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. వీరిపై జిల్లావ్యాప్తంగా ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో సుమారు 8 కేసుల వరకు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ చెప్పారు. వీరు గతంలో చేసిన నేరాలపై జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు, ఎస్‌ఐ జీ. ఉదయ్‌కుమార్‌, ఏఎస్‌ఐ షకీల్‌, పీసీలు ఎండీ ఖాలీద్‌, మల్లికార్జున్‌, గంగారాంలు ముఖ్యపాత్ర వహించారని తెలిపారు.

Updated Date - 2022-11-12T00:12:25+05:30 IST