వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2022-09-27T04:52:33+05:30 IST

మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం దొంగలను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుల వద్దనుంచి 12.38తులాలబంగారం, 5.61 గ్రాముల వెండి, రూ.8500 నగదు, బుల్లెట్‌ వాహనం స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26: మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం దొంగలను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుల వద్దనుంచి 12.38తులాలబంగారం, 5.61 గ్రాముల వెండి, రూ.8500 నగదు, బుల్లెట్‌ వాహనం స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన ముగ్గురు బండి నీలేష్‌-ఏ1 కాగా, దూల రాజేశం-ఏ2, దూల నవీన్‌-ఏ3 నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ముగ్గురు మిత్రులు. కాగా కొన్నినెలల నుంచి పలు బంగారు, కిరాణదుకాణాల్లో చోరీలకు పాల్పడినట్లుతెలిపారు. సోమవారం ఉదయం వాంకిడి ఎస్సై దీకొండ రమేష్‌ సిబ్బందితో కలిసి లంజన్‌వీరా చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈముగ్గురు నిందితులు బుల్లెట్‌పై హెల్మెట్‌ ధరించి గడ్డపారలతో వెళ్తుండగా అనుమానం తో తమదైన శైలిలో విచారించారు. దీంతో తమనేరాల చిట్టాను విప్పారు. వీరు మంచిర్యాల జిల్లాలో ఆరు, కుమరంభీంఆసిఫాబాద్‌ జిల్లాలో ఆరు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఏ1 నిందితుడు బండి నీలేష్‌ కొంతకాలం క్రితం రెబ్బెనలో బైక్‌ మెకానిక్‌గా పని చేస్తుండేవాడు. బైక్‌మెకానిక్‌ పని చేయడం వల్ల వచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువడబ్బులు సంపాదించాలన్న ఆశతో దూరపు బంధు వులైన దూల రాజేశం, అతని తమ్ముడు దూల నవీన్‌ను సంప్రదించాడు. విష యం చెప్పి ముగ్గురు కలిసి రాత్రిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో, షాప్‌లలో దొంగతనం చేసి వచ్చిన డబ్బులను పంచుకుందామని నిర్ణయించుకున్నారు. ఇలా సంవత్స రం నుంచి ముగ్గురుకలిసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను, షాప్‌లను గమనించి రాత్రిళ్లు దొంగతనాలు చేసేవారు. వీరివద్ద నుంచి మొత్తం 12కేసులకు సంబంధించి 12 తులాల 38గ్రాముల బంగారం, 5కిలోల61గ్రాముల వెండి, రూ.8500నగదు రికవరీ చేశామన్నారు. దొంగ లను పట్టుకుని చాకచక్యంగా కేసును చేధించిన ఆసిఫాబాద్‌ డీఎస్పీ, వాంకిడి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై దీకొండ రమేష్‌, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందిం చారు. వారికి క్యాష్‌ రివార్డు అందజేశారు.

Updated Date - 2022-09-27T04:52:33+05:30 IST