అక్రమంగా అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-09-14T03:41:15+05:30 IST

సింగరేణి, వీఆర్‌ఏ కాంట్రాక్టు కార్మికుల చలో అసెంబ్లీ పిలుపు మేర కు మద్దతు తెలిపిన జేఏసీ నాయకులను అరెస్టు చేయ డం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిరసనకు మద్దతుగా వెళ్తున్న సీపీఎం, సీపీఐ, ఇతర సంఘాల నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు.

అక్రమంగా అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలి
మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 13: సింగరేణి, వీఆర్‌ఏ కాంట్రాక్టు కార్మికుల చలో అసెంబ్లీ పిలుపు మేర కు మద్దతు తెలిపిన జేఏసీ నాయకులను అరెస్టు చేయ డం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన  మాట్లాడుతూ నిరసనకు మద్దతుగా వెళ్తున్న సీపీఎం, సీపీఐ, ఇతర సంఘాల నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల  చేయాలని, ప్రభుత్వం దిగి వచ్చి సమ్మె చేపట్టిన  వీఆర్‌ ఏల, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు  పరిష్క రించాలన్నారు. సీఐటీయూ జిల్లా  మహిళా  కార్యదర్శి  రాజేశ్వరి, శకీల్‌, సాగర్‌, సోను, శంకర్‌ పాల్గొన్నారు.  

రైల్వేస్టేషన్‌లో పోలీసుల బందోబస్తు  

సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, వీఆర్‌ఏలు తలపెట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనుమాని తులను అదుపు లోకి తీసుకొని బైండోవర్‌ చేశారు. ఎస్సై రాజేంద్రప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అరెస్టులకు నిరసనగా సీపీఎం రాస్తారోకో 

కోటపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల, వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి హైద్రాబాద్‌లో తలపెట్టిన సమ్మెకు వెళ్తున్న సీపీఎం నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటని ఆ సంఘం మండల కార్యదర్శి కావిరి రవి అన్నారు. అరెస్టులకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు.  జక్కుల మారయ్య, ఈర్ల జమున, మెడ లక్ష్మీ, శంకరమ్మ, మధునక్క  పాల్గొన్నారు.

యూఎస్‌పీసీ నాయకుల ముందస్తు అరెస్టు  

ఏసీసీ:  ఉపాద్యాయుల విద్యారంగ  సమస్యలు పరి ష్కరించాలని చలో అసెంబ్లీని తలపెట్టిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూపీఎస్‌సీ)  నాయకులను   పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్‌లు, నియామకాలు చేపట్టాలని, 317  జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్దరించాలన్నారు. అరెస్టు అయిన వారిలో గొల్ల రామన్న, శ్రీమన్నారాయణ, జాకీర్‌, చక్రపాణి, రూప్లానాయక్‌, దేవిదాస్‌, రమేష్‌ ఉన్నారు.   

Read more