బియ్యం గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలి

ABN , First Publish Date - 2022-10-04T05:09:26+05:30 IST

ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ (మండల్‌ లెవల్‌ స్టాక్‌)పాయింట్‌ నుంచి రూ.3కోట్ల బియ్యం గోల్‌మాల్‌ చేసిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబుడిమాండు చేశారు. మంగళవారం స్థానిక ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 840 క్వింటాళ్ల బియ్యం మాయం చేసి దారి మళ్లించినట్టు పేర్కొన్నారు.

బియ్యం గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలి
సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్నట్టు మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌ బాబు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 3: ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ (మండల్‌ లెవల్‌ స్టాక్‌)పాయింట్‌ నుంచి రూ.3కోట్ల బియ్యం గోల్‌మాల్‌ చేసిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబుడిమాండు చేశారు. మంగళవారం స్థానిక ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 840 క్వింటాళ్ల బియ్యం మాయం చేసి దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌తో పాటు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ హస్తమున్నట్టు ఆరోపించారు. వీరి కనుసన్నులలోనే ఈ తతంగం జరిగినట్టు పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయనున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈస్కాంపై న్యాయం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి కొంగ సత్యనారాయణ, ఈర్ల విశ్వేశ్వర్‌రావు, సిందం శ్రీనివాస్‌, సర్పంచి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read more