ఆసిఫాబాద్‌ పట్టణం టీఆర్‌ నగర్‌లో చోరీ

ABN , First Publish Date - 2022-11-16T21:58:55+05:30 IST

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 16: పట్టణంలోని తారకరామనగర్‌లోని రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గుర్రాల వెంకటేశ్వర్‌ ఇంట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న ఇంటికి తాళం వేసి సొంత పనుల నిమిత్తం మంచిర్యాలలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లారు.

ఆసిఫాబాద్‌ పట్టణం టీఆర్‌ నగర్‌లో చోరీ

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 16: పట్టణంలోని తారకరామనగర్‌లోని రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గుర్రాల వెంకటేశ్వర్‌ ఇంట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న ఇంటికి తాళం వేసి సొంత పనుల నిమిత్తం మంచిర్యాలలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి బుధవారం ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి బెడ్‌రూంలోని బీరువాలు చిందరవందరంగా ఉన్నాయి. దీంతో చోరి జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఉన్న ఎనిమిది తులాల బంగారం, రూ.లక్ష నగదు దొంగలించారని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు సీఐ రాణాప్రతాప్‌, ఎస్సైలు గంగన్న, రమేష్‌, రాజేశ్వర్‌ క్లూస్‌టీం బృందాలతో తనిఖీ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-16T21:58:55+05:30 IST

Read more