అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-11-11T22:36:40+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయ మని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని 80 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం

చెన్నూరు, నవంబరు 11: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయ మని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని 80 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకంతో నిరుపేద యువతుల వివా హాలు ఆనందంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభి వృద్ధి చెందుతుందన్నారు. అన్ని గ్రామాల్లో విద్యుత్‌, మంచినీరు, రోడ్డు సౌకర్యాలు ఏర్పడ్డాయన్నారు. రైతు బంధు, బీమా పథకాలతో రాష్ట్రం దేశంలోనే ఆదర్శం గా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రధాని మోదీ, అమిత్‌షా కుట్రలు చేస్తున్నా రని, ఇది జరగదని పేర్కొ న్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం విచారణ ఆపాలని కోర్టులో పిటిషన్‌ వేసిన దుర్మార్గులు బీజేపీ నాయ కులన్నారు. చెన్నూరుకు వంద పడకల ఆసుపత్రిని సాధించు కున్నా మని, వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మీ, ఎంపీ వెంకటేష్‌నేత పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T22:36:40+05:30 IST

Read more