అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-09T04:24:21+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం మున్సిపాలిటీలోని పలు వార్డులకు చెందిన 268 మంది లబ్ధిదారులకు మంజూరైన పింఛన్‌ కార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు

అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
పింఛన్‌ గుర్తింపు కార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య

బెల్లంపల్లి, సెప్టెంబరు 8: అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం మున్సిపాలిటీలోని పలు వార్డులకు చెందిన 268 మంది లబ్ధిదారులకు మంజూరైన పింఛన్‌ కార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలందరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, కౌన్సిలర్‌లు షేక్‌ఆస్మా, సురేష్‌, రమేష్‌, భరద్వాజ్‌, రాయలింగు, కృష్ణ, టౌన్‌ ప్రెసిడెంట్‌ నారా యణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. 

 దండేపల్లి: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. కన్నెపల్లి, కొర్విచెల్మ, రెబ్బనపల్లి, వెంకటాపూర్‌, చింతపల్లి, కొత్తమామిడిపల్లి గ్రామాల్లో ఆసరా పింఛన్‌  కార్డులను అందజేశారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగన్న, సురేష్‌,  ఎంపీడీవో మల్లేషం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఎంపీటీసీలు పాల్గొన్నారు.   

Read more