బిల్లులు స్వాహా చేశారని రుద్రాపూర్‌ గ్రామస్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-09-30T04:03:01+05:30 IST

మండలం లోని రుద్రాపూర్‌లో సర్పంచ్‌ ఇంద్రపాల్‌ మరు గుదొడ్ల బిల్లులు వాడుకున్నారని ఆరోపిస్తూ గురువారం గ్రామస్థులు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకుడు గుంతల కోసం కూడా జనాల దగ్గరనుంచి రూ.500 తీసుకున్నా రని ఆరోపించారు.

బిల్లులు స్వాహా చేశారని రుద్రాపూర్‌ గ్రామస్థుల ఆందోళన
గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

చింతలమానేపల్లి, సెప్టెంబరు 29: మండలం లోని రుద్రాపూర్‌లో సర్పంచ్‌ ఇంద్రపాల్‌ మరు గుదొడ్ల బిల్లులు వాడుకున్నారని ఆరోపిస్తూ గురువారం గ్రామస్థులు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకుడు గుంతల కోసం కూడా జనాల దగ్గరనుంచి రూ.500 తీసుకున్నా రని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీవో మహేందర్‌ను వివరణకోరగా సర్పంచ్‌ డబ్బులు వాడుకున్న విషయం నిజమేనని అయితే సొంతానికి వాడుకోలేదన్నారు. చిన్న గ్రామపంచాయతీ అయినం దున ట్రాక్టర్‌, ఈఎంఐ, జీపీ మెంటనెన్స్‌ కోసం వాడారని తెలిపారు. సర్పంచ్‌ ఇంద్రపాల్‌ త్వరలోనే లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ఐతే ఉన్నతాధికారులు ఈఘటనపై విచారణ జరిపిచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Read more