ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి

ABN , First Publish Date - 2022-02-23T06:26:50+05:30 IST

టీచర్‌ నిరంతరం స్టూడెంట్‌గా ఉంటూ పుస్తకాలను చదవడంతో పాటు కొత్త విషయాలను తెలుసుకోనేలా నిరంతరం శ్రమించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ పీవో క్యాంపు కార్యాలయంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో

ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అంకిత్‌

ఉపాధ్యాయుల సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్‌
ఉట్నూర్‌, ఫిబ్రవరి 22: టీచర్‌ నిరంతరం స్టూడెంట్‌గా ఉంటూ పుస్తకాలను చదవడంతో పాటు కొత్త విషయాలను తెలుసుకోనేలా నిరంతరం శ్రమించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్‌ అన్నారు. స్థానిక  ఐటీడీఏ పీవో క్యాంపు కార్యాలయంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దశల వారిగా అన్ని పాఠశాల ల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టడం జరుగుతున్నందున ఉపాధ్యాయులు కాలానికి అనుగుణంగా బోధన నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. త్వరలోనే ఐటీడీఏ టీచర్లకు దశల వారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ విద్యార్థి దశలో ప్రాథమిక స్థాయి విద్యనే ప్రధానమని, ప్రాథమికస్థాయి బోధించే ఉపాధ్యాయులే వారి జీవితాలను ప్రభావింతం చేసే శక్తి కలిగి ఉంటారన్నారు. ఈ సమావేశంలో ఎసీఎంవో జగన్‌, గురుకులాల ఆర్సీవో గంగాధర్‌, జీసీడీవో ఛాయ, ఎస్సీఆర్పీ బలిరాం, తదితరులున్నారు.
పీవీటీజీల సంక్షేమం కోసం కృషి
 ఉమ్మడి జిల్లాలోని ఆదిమ గిరిజనులైన కొలాం, తోటి గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక కృషి చేపడుతున్నామని ఐటీడీఏ పీవో అంకిత్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆదిమ గిరిజన సంఘాల పెద్దలతో ని ర్వహించిన ప్రత్యేక సమావేశానికి మహిళ కమీషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబా యి హాజరయ్యారు. కొలాం, తోటి గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం సీసీడీపీ నిధులను కేటాయిస్తుందని వీటి ద్వారా చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి  చర్చించారు. ఈశ్వరీబాయి మాట్లాడుతూ పీవీటీజీ నిధుల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ రమణ, ఏపీవో భారతి, ఏవో రాంబాబు, జేడీఎం నాగభూషనం, జిల్లా కొలాం సేవా సంఘం అధ్యక్షుడు ఆత్రం శేషారావు, రాధాబాయి, భీంరావు, టేకాం భాస్కర్‌, వసంత్‌రావు, మర్సుకోల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T06:26:50+05:30 IST